నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. రాబోయే 12గంటల్లో ఇది మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో బుధ, గురువారాల్లో తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.