టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు జై కొట్టిన విషయం తెలిసిందే. డైరక్ట్‌గా వైసీపీలోకి వెళితే పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి, పార్టీలో చేరకుండా ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతున్నారు. అంటే అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా నడుచుకుంటున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ కుమార్‌లు ప్రస్తుతం వైసీపీ మద్ధతుదారులుగా ఉన్నారు.