2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్తితి ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ, ఒక్కసారిగా ఘోరంగా ఓడిపోయింది. దీంతో నేతలు వరుస పెట్టి అధికార పార్టీలోకి జంప్ కొట్టేశారు. అయితే తమ పార్టీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ రూల్ పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ రూల్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డైరక్ట్‌గా వైసీపీలో చేరకుండా, టీడీపీని వీడి నలుగురు ఎమ్మెల్యేలు జగన్‌కు జై కొట్టారు.