జగన్ అధికార పీఠం ఎక్కగానే ఒకేసారి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కని వారికి రెండున్నర ఏళ్లలో మళ్ళీ ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారు. పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి వేరే వారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటింది. అంటే మరో ఏడాదిలో జగన్ మంత్రివర్గ విస్తరణ చేయడం ఖాయం. అయితే ఈ కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కించుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.