నాగార్జున స్థానం పై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా సీరియస్గా దృష్టి పెడుతున్నారు. గత ఎన్నికల్లోనే నాగార్జున సాగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపారు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి. ఇక ఈ ఉప ఎన్నికలో పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో జానారెడ్డిని తమ పార్టీలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు కమలనాథులు. అంతేకాదు రఘువీర్ రెడ్డి తమతో టచ్లో ఉన్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.మరోవైపు జానారెడ్డిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇటు టీఆర్ఎస్ కూడా నాగార్జున సాగర్లో బలమైన అభ్యర్థిని దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో పొలిటికల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...