ఇక గ్రేటర్ పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈనెల 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు పర్యవేక్షకులను తెలంగాణ ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ నుంచి 31 మందిని పర్యవేక్షకులుగా నియమిస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.