జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిన్న ఉదయం పోలింగ్ స్లోగా సాగింది. మూడు గంటల తర్వాత ఒక్కసారిగా పోల్ మీటర్ పెరిగింది. అయితే హాఫ్ సెంచరీని మాత్రం టచ్ కాలేదు. మొత్తం పోలింగ్ శాతం చూస్తే 46.55 శాతం నమోదైంది. 74 లక్షల మంది ఓటర్లలో 34 లక్షల 50 వేల మంది ఓటేశారు. ఆర్సీపురం డివిజన్లో అత్యధికంగా 67.71 శాతం నమోదైతే…యూసుఫ్‌గూడలో 32.33 శాతం తక్కువ పోలింగ్ నమోదైంది.