తాజాగా జార్ఖండ్లో దారుణం జరిగింది. 15 ఏళ్ల ఓ ఆదివాసీ బాలికపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి ఓ ఉత్సవానికి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో బాలికపై ఈ అఘాయిత్యం జరిగింది. ఖుంతీ జిల్లాలోని కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.