గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ హఠాత్తుగా స్టాండ్ మార్చారు. అనూహ్యంగా కేసీఆర్ సర్కారుని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత పవన్ నోటి వెంట తెలంగాణ సర్కారు మాట వినపడటం గమనార్హం. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరోక్షంగా ప్రశంసించారు. వరదల సమయంలో కేసీఆర్ ఇంటికి రూ.10వేలు నష్టపరిహారం ప్రకటించారని గుర్తు చేశారు.