జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం అత్యల్పంగా ఉండటంతో.. హైదరాబాద్ వాసులపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. గ్రేటర్ ఓటర్లు బద్దకస్తులని, వరదసాయం కోసం క్యూలైన్లలో నిలబడినవారు, వైన్ షాపుల ముందు కరోనా టైమ్ లో కూడా క్యూ కట్టినవారు, కనీసం ఓటింగ్ కి ఎందుకు రాలేదని విమర్శిస్తున్నారు. సాక్షాత్తూ పోలీస్ ఉన్నతాధికారి సైతం.. ఓటు వేయనివారికి ప్రభుత్వ పథకాలు కట్ చేయాలంటూ మాట్లాడటం సంచలనంగా మారింది. అసలింతకీ గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేయకపోడవం పాపమా? ఓటు వేసినవాళ్లంతా పుణ్యాత్ములా? వేయనివాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినవాళ్లవుతున్నారా..?