పెరిగిన పోలింగ్ శాతం తమకి అనుకూలం అని అంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సెంచరీ కొడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ నమోదైందని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ విమర్శలు చేస్తూ పోలింగ్‌పై తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.