దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ కి కాషాయ భయం పట్టుకుందని, అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, పోలీసుల్ని అడ్డంపెట్టుకుని దౌర్జన్యాలకు దిగారని మరోసారి మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. బీజేపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కాషాయం ధరించే వారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్కు కాషాయం భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.