గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్ర నాయకత్వం కదలి వచ్చింది. వ్యాక్సిన్ పని మీద మీద హైదరాబాద్ వచ్చినా.. సరిగ్గా ఎన్నికల ముందు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కూడా ఆసక్తికరంగా సాగింది. ఆ లెక్కన చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు.. హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అయితే ఈ సందడి అక్కడికే పరిమితమా లేక త్వరలో జరగబోతున్న తిరుపతి ఉప ఎన్నికకు కూడా వర్తిస్తుందా అనేది సందేహాస్పదం.