ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తనదైన శైలిలో అసెంబ్లీలో చంద్రబాబుకు చుక్కలు చూపించారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కొడాలి నాని కూడా సభలో మాట్లాడి, మరింత హీట్ పెంచారు. ఎప్పటిలాగానే బాబుని ఒక ఆట ఆడుకున్నారు. టీడీపీ, చంద్రబాబులు జగన్ మీద చేసే నెగిటివ్ ప్రచారాలని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు, జగన్ మీద విమర్శలు చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు.