గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. 7.45 నిముషాలకు స్ట్రాంగ్ రూమ్ లు తెరిచి బ్యాలెట్ బాక్స్ లను తీసుకొచ్చిన పోలింగ్ సిబ్బంది.. కౌంటింగ్ మొదలు పెట్టారు. ఈ ఏడాది అత్యల్ప ఓటింగ్ జరిగిన మొహిదీ పట్నం డివిజన్ కి సంబంధించి తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెహిదీపట్నం డివిజన్లో అత్యల్పంగా 11,818 ఓట్లు పోలయ్యాయి. అంటే ఒక రౌండ్ లోనే మెహిదీ పట్నం రిజల్ట్ తేలిపోతుందన్నమాట.