గ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదలవుతాయి. అయితే గ్రేటర్ బరిలో అభ్యర్థులకు ఓట్లు సమంగా వస్తే ఏం చేస్తారు? ఎవరిని విజేతగా ప్రకటిస్తారు? సమంగా ఓట్లు వస్తే ఏం చేయాలో ముందుగానే నిర్ణయించారు అధికారులు. దీనిపై సిబ్బందికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి స్పష్టం చేశారు. అభ్యర్థులకు సమంగా ఓట్లు వస్తే ఏంచేయాలనే విషయంపై వారికి మార్గదర్శకాలు జారీ చేశారు. అందరినీ సమన్వయం చేసుకుని, బాధ్యతాయుతంగా ఈ పని పూర్తి చేయాలని సూచించారు.