ఏపీలో బీజేపీకి ఎంత సత్తా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పార్టీకి పెద్ద బలం లేని సంగతి ఎన్నికల్లో తేలిపోయింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీ, ఏపీలో బాగానే హడావిడి చేస్తుంది. అసలు అధికార వైసీపీకి తామే అసలైన ప్రత్యర్ధులమని చెబుతున్నారు. టీడీపీ కంటే తామే అసలైన ప్రతిపక్షమని హడావిడి చేస్తున్నారు. అయితే బీజేపీ రాజకీయం చేయడంలో కూడా ఓ వ్యూహం ప్రకారం ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.