ఏపీ అసెంబ్లీ సమావేశాలు బాగా హాట్ హాట్‌గా సాగిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. అసెంబ్లీలో అధికార పక్షం బలం ఎక్కువగా ఉండటంతో, టీడీపీ నేతలకు డిఫెండ్ చేయడం చాలా కష్టమైపోయింది. అయినా సరే టీడీపీ నేతలు ఏదొరకంగా అధికార వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో జగన్ పాదయాత్ర సమయంలో ఏమి హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో ఏ హామీలు పెట్టారు. వాటిని అమలు చేసే విధానంలో ఎలా అమలయ్యాయనే విషయంపై టీడీపీ నేతలు బాగానే ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు.