గత కొన్నిరోజులుగా ఏపీలో అడుగుపెట్టని పవన్...ప్రస్తుతం వరదల వల్ల నష్టపోయిన రైతులని పరామర్శించే పనిలో పడ్డారు. ఇటీవల తుఫానుకు ఏపీలో చాలా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఇప్పటివరకు హైదరాబాద్‌కే పరిమితమైన పవన్...రైతులని ఓదార్చే కార్యక్రమం పెట్టుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో పర్యటించిన పవన్, ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.