జీహెచ్ఎంసీ సర్కిల్-6లోని ఏడు డివిజన్లలో 4 డివిజన్లు ఎంఐఎం కైవసం చేసుకుంది. కేవలం రెండు డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. ఎంఐఎం నుంచి అక్బర్‌బాగ్ డివిజన్లో సయ్యద్ మినాజుద్దీన్ బీజేపీ అభ్యర్థి నవీన్‌రెడ్డిపై 3908 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.