పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా పర్యటనలో దొంగల చేతివాటంతో జనసైనికులు లబోదిబోమన్నారు. చిత్తూరు జిల్లానుంచి పవన్ నెల్లూరు జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారీ ర్యాలీ తీశారు. మనుబోలు సమీపంలో పవన్ కి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానుల సెల్ ఫోన్లు, పర్స్ లు దొంగతనానికి గురయ్యాయి. పవన్ ర్యాలీలో కలసిపోయిన పిక్ పాకెటర్లు చేతివాటం చూపడంతో జనసైనికులు, పవన్ అభిమానులు లబోదిబోమన్నారు.