గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా ఫలితాలు మాత్రం కారు సర్కారుకి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. సెంచరీ కొడతాం, వందకు పైగా స్థానాలు సాధిస్తామంటూ ధీమాగా చెప్పిన నేతలు ఇప్పుడు డీలా పడ్డారు. 150 స్థానాలలో కేవలం 55చోట్ల మాత్రమే టీఆర్ఎస్ కు విజయం దక్కింది. గతంలో కేవలం 4 సీట్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈ దఫా 48 స్థానాలకు ఎగబాకింది. ఇక ఓటింగ్ శాతం లెక్క తీస్తే టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.