గ్రేటర్ లో ఫలితం తేడా వస్తే.. బీజేపీపై ఒత్తిడి పెంచి మరీ తిరుపతి సీటు దక్కించుకోవాలని అనుకున్నారు పవన్ కల్యాణ్. అందుకే అయిష్టంగానే గ్రేటర్ లో బీజేపీ ఓడిపోవాలని కోరుకున్నారట. అయితే అక్కడ ఫలితం తేడా వచ్చింది. దుబ్బాక, ఆ తర్వాత గ్రేటర్ ఫలితాలతో దూకుడు మీదున్న బీజేపీ.. తిరుపతి ఉప ఎన్నికలను కూడా అంతే సమర్థంగా ఎదుర్కునేందుకు సిద్ధపడుతోంది. ఇదే ఇప్పుడు పవన్ కల్యాణ్ కి చిక్కులా మారింది.