జీహెచ్ఎంసీలో మొత్తం డివిజన్లు 150. టీఆర్ఎస్ కి భారీ మెజార్టీ వచ్చి ఉంటే.. మేయర్ ఎన్నికకు ఎక్స్ అఫిషియోల అవసరం వచ్చి ఉండేది కాదు. గతంలో ఏకంగా 99 స్థానాలు సాధించిన టీఆర్ఎస్.. ఎక్స్ అఫిషియోల అవసరం లేకుండానే మేయర్ పీఠం కైవసం చేసుకుంది. ఈ దఫా ఆ పార్టీ బలం 55 దగ్గరే ఆగిపోయింది. అంటే మేజిక్ ఫిగర్ చేరుకోలేదన్నమాట. దీంతో అనివార్యంగా ఎక్స్ అఫిషియోలను కూడా కలపాల్సి ఉంటుంది.