ఎన్నికలకు కొన్నిరోజుల ముందుగా వచ్చిన వరదలు గ్రేటర్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించాయనే మాట మాత్రం వాస్తవం. గ్రేటర్ ఎన్నికలకు ముందుగానే వరదలొచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో వర్షాలు పడి, వరదనీటితో నగరం అతలాకుతలం అయింది. కాలనీలన్నీ జలమయం అయ్యాయి. పరామర్శకు వెళ్లిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అప్పుడే ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుందనే వాదన బలపడింది.