మేయర్ పీఠం ఎవరి దక్కుతుంది.. నగరానికి మేయర్ అయ్యేవారు మహిళల లేక పురుషులా అనే విషయాల పై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇద్దరు మహిళలు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. మేయర్ పీఠం కైవసం దిశగా అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈసారి మేయర్ పీఠం దక్కే ఆ అదృష్టవంతులు ఎవరనే ఊహగానాలు ఊపందుకున్నాయి. ఈసారి మేయర్ సీటును జనరల్ మహిళకు రిజర్వ్ అయింది.ఇకపోతే మేయర్పీఠంపై కూర్చునే ఆ మహిళామణి ఎవరు అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా బొంతు శ్రీదేవి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిలు మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది.