ఏపీలో జగన్ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ల మధ్య వార్ నడుస్తూనే ఉంది. నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంటే, వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పిసింది. అలాగే ఎలక్షన్ కమిషన్కు ఎలాంటి సపోర్ట్ కూడా ఇవ్వడం లేదు. దీంతో నిమ్మగడ్డ మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు.