కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో దూకుడు చూపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీలు దారుణ స్థితికి చేరుకోవడంతో అధికార టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. అందుకే ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో, తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటింది. అయితే తెలంగాణలో బీజేపీ దూకుడుగా ఉండటంతో ఏపీలో కూడా సత్తా చాటుతామని సోము వీర్రాజు అంటున్నారు.