మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం చేసిన తాపీ మేస్త్రి నాగేశ్వరరావుని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. మంత్రి నానిపై పక్కా ప్లానింగ్ తోనే నిందితుడు హత్యాయత్నానికి ఒడిగట్టు నట్టు తెలుస్తోంది. ఇటీవల మంత్రి నాని తల్లి మృతిచెందగా.. అప్పటినుంచి నిందితుడు నాగేశ్వరరావు మంత్రి ఇంటి చుట్టూ తిరిగి రెక్కీ నిర్వహించాడని, చివరకు దాన్ని అమలు చేశాడని పోలీసు విచారణలో తేలినట్టు తెలుస్తోంది.