ఏలూరులో మూర్ఛవ్యాధి దావానలంలా వ్యాపించింది. ఉన్నట్టుండి ఒక్కొక్కరూ స్పృహతప్పి పడిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. పట్టణంలో దాదాపు 100మంది ఇవే లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ముందు దక్షిణ వీధిలో కొందరు ఈ లక్షణాలతో పడిపోయారు. ఆ తర్వాత రాత్రికి పడమర వీధి, కొత్తపేట, అశోక్ నగర్, అరుంధతిపేట.. సహా మరికొన్ని ప్రాంతాల్లో మూర్ఛ లక్షణాలతోనే రోగులు పడిపోయి ఆస్పత్రిలో చేరారు. దీంతో ఒక్కసారిగా పట్టణంలో కలకలం రేగింది. ఆ వెంటనే సోషల్ మీడియాలో ఈ వార్త మరింతగా వ్యాపించి ఆందోళనకు గురి చేసింది. ఏలూరులో అంతు చిక్కని రోగం వచ్చిందని, ప్రజలంతా పిట్టల్లా రాలిపోతున్నారని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారంటూ రకరకాల వార్తలొచ్చాయి.