సీఎం జగన్ కి పవన్ అల్టిమేట్టం ఇచ్చారు, వైసీపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. ఆలోగా రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంపై ప్రకటన చేయకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలకు దిగుతామంటూ హెచ్చరించారు. 4రోజులపాటు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా రైతులు నష్టపరిహారం అందక ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలని, ఎకరాకు రూ.35వేల పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే రైతులకు మద్దతుగా ఈనెల 7న అన్ని జిల్లాల్లో జనసేన నిరసన దీక్షలు చేపడుతుందని హెచ్చరించారు.