ఓవైపు ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ కి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతుండగా.. కొంతమంది చేస్తున్న నిర్వాకం ఏకంగా పోలీస్ డిపార్ట్ మెంట్ కే మచ్చగా మిగులుతోంది. ఆమధ్య నంద్యాలలో ఓ ఆటోడ్రైవర్ కుటుంబం ఆత్మహత్య విషయంలో ఇద్దరు పోలీసులపై అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా.. పోలీస్ స్టేషన్ కి న్యాయం కోసం వచ్చిన బాధితురాలినే బెల్ట్ తో కొట్టి ఓ ఎస్సై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.