ఇటీవల గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అధినాయకత్వం అంతా హైదరాబాద్ పై ఫోకస్ పెట్టే సరికి కేసీఆర్ ఏకంగా ఢిల్లీనే టార్గెట్ చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమికి తానే నాయకత్వం వహిస్తానంటూ సవాల్ విసిరారు. త్వరలో హైదరాబాద్ వేదికగా అన్ని పార్టీలను ఒకేచోట చేరుస్తామని, ఢిల్లీతో కయ్యానికి దిగుతామని అన్నారు. అయితే గ్రేటర్ ఫలితాలతో టీఆర్ఎస్ డీలా పడే సరికి కేసీఆర్ వెనక్కు తగ్గుతారని అందరూ ఈహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్, మోదీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈనెల 8వతేదీన భారత్ బంద్ లో టీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొంటాయని తేల్చి చెప్పారు కేసీఆర్.