కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా ఉన్న విజయశాంతి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు చాలా కాలంగా వినపిస్తున్నా.. మహూర్తంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దుబ్బాక ఎన్నికలకు ముందే ఈ లాంఛనం పూర్తి కావాల్సి ఉన్నా ఎందుకో ఆలస్యం అవుతూ వస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కూడా విజయశాంతి బీజేపీలో చేరుతోందంటూ పుకార్లు వినిపించాయి. అయితే ఆమె మాత్రం ఎలాంటి కబురు చెప్పలేదు. తాజాగా ఇప్పుడు విజయశాంతిపై మరో పుకారు ప్రచారంలోకి వచ్చింది. సోమవారం మహూర్తం కుదిరిందని, రాములమ్మ కాషాయ కండువా కప్పుకుంటోందని బ్రేకింగ్ లు నడుస్తున్నాయి. మరి వీటిలో నిజమెంత..?