ఎప్పుడు లేని విధంగా తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బాగా హాట్ హాట్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తిరుగులేదని భావించిన అధికార టీఆర్ఎస్కు బీజేపీ దాదాపు చెక్ పెట్టే స్థాయికి వచ్చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్-టీడీపీలు దారుణ పరిస్థితికి వెళ్లిపోవడంతో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. అందుకే గ్రేటర్లో 150 డివిజన్లలో బీజేపీ ఎప్పుడు లేని విధంగా 48 చోట్ల గెలిచింది. ఇక గత ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్న అధికార టీఆర్ఎస్ ఇప్పుడు 56 చోట్ల విజయం సాధించింది. ఇక ఎంఐఎం తన స్థానాలని నిలబెట్టుకుని 44 చోట్ల సత్తా చాటింది. ఇక కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది.