తెలంగాణలో బీజేపీ దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఇతర ప్రతిపక్ష పార్టీలని అధికార టీఆర్ఎస్ తోక్కేయడంతో ఒక్కసారిగా బీజేపీ పుంజుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో గులాబీ పార్టీకి చుక్కలు చూపించిన కమలం గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు ఓడించినంత పని చేసింది. అయితే తెలంగాణలో బీజేపీ నేతలని చూసి ఏపీ బీజేపీ నేతలు జబ్బలు చరుస్తున్నారు. ఏపీలో కూడా కాంగ్రెస్ కనుమరుగైపోయిందని, దాని బాటలోనే టీడీపీ కూడా వెళుతుంది. అధికార వైసీపీకి తామే అసలైన ప్రత్యర్ధులమని బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారు.