ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు ఒక్కసారిగా అధికారం కోల్పోవడం వలనో, లేక తనకంటే చాలా జూనియర్ అయిన జగన్ సీఎం కావడం వలనో తెలియదుగానీ, బాబుకు అధికారం కోల్పోయాక మాత్రం బాగా ఫ్రస్టేషన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే మళ్ళీ వెంటనే అధికారంలోకి వచ్చేయాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి బాబు అదే పనిలో ముందుకెళుతున్నారు.