ఏపీలో అధికార వైసీపీ, ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే, ఏపీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ముందుకెళుతుంది. కరోనా సమయంలో ఎన్నికలకు సిద్ధంగా లేమని వైసీపీ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. అయితే నిమ్మగడ్డ మాత్రం ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ అని, ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వ జోక్యం అవసరం లేదని చెబుతున్నారు.