ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) అనే వ్యక్తి ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన మూర్ఛ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. అయితే సరైన వైద్యం అందకనే శ్రీధర్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే అతడు మృతి చెందాడని వైద్యులు చెబుతున్నారు.