అమరావతి ఉద్యమం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అమరావతి అనుకూల వర్గం ఓవైపు, మూడు రాజధానులకు మద్దతిస్తున్న బహుజన పరిరక్షణ సమితి మరోవైపు.. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. లేకపోతే.. మరింత ఇబ్బందికర వాతావరణం నెలకొనేదని తెలుస్తోంది.