తీవ్రంగా మారుతున్న ఏలూరు అస్వస్థత.. పెరుగుతున్న మృతుల సంఖ్య..తాజాగా ఈ విషయం పై కేంద్రం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఫోన్లో చర్చించారు. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏపీ గవర్నర్ కార్యాలయంతో కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. గవర్నర్ నుంచి ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక వచ్చాక కేంద్రం సహకారం పూర్తిగా లభిస్తుందని ఆయన తెలిపారు.