కొవిడ్ టీకా ఇంకా మార్కెట్ లోకి రాక మునుపే దాని సరఫరా, నిల్వపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రాలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టీకా నిల్వ చేసే పరిస్థితులు, టీకాని ప్రజలకు చేర్చే ఆరోగ్య సిబ్బంది పై ఓ అంచనాకు వచ్చాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం తొలిదశలో కోటీ 60లక్షలమందికి కరోనా టీకా వేసే అవకాశాలున్నట్టు తెలిపింది. అటు తెలంగాణ ప్రభుత్వం అంచనా ప్రకారం.. 70నుంచి 75లక్షల మందికి తొలి విడదలతో టీకా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.