గ్రేటర్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటున్న టీఆర్ఎస్.. పార్టీ శ్రేణులకు రాబోయే ఎన్నికల గురించి దిశా నిర్దేశం చేస్తోంది. ముఖ్యంగా జమిలి ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ ఉపదేశమిచ్చారు. ఇప్పటి వరకూ జమిలి ఎన్నికల విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మాత్రమే ప్రముఖంగా చెప్పేవారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ జమిలి బాట పట్టారు. జమిలి ఎన్నికలొస్తాయి, కేంద్రం నుంచి నాకు సమాచారం ఉంది అన్నట్టు మాట్లాడారు పవన్. తాజాగా ఇప్పుడు కేటీఆర్ వీరిద్దరినీ ఫాలో అవుతున్నారు. జమిలికి కేంద్రం సిద్ధపడుతోందని, టీఆర్ఎస్ శ్రేణులు ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు.