కరోనా ప్రభావంతో విద్యుత్ సంస్థలు భారీ ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటిని గాడిలో పెట్టాలంటే విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కూడా ఈ ఏడాది భారీగా విద్యుత్ చార్జీలు పెంచుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా సంక్షోభంలో విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నా కూడా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించారు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని స్పష్టం చేశారు.