విశాఖలో గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగి ఒక్కొక్కరే కుప్పకూలిపోవడం.. అందరికీ తెలిసిన విషయమే. విషవాయువు ప్రభావంతో.. అసలు ఏమయిందో తెలుసుకునేలోగానే చాలామంది మృత్యువాత పడ్డారు. తాజాగా ఏలూరులో జరిగిన ఎపిసోడ్.. విశాఖ దుర్ఘటననే గుర్తుకు తెస్తోంది. ఏలూరులో కూడా అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే చాలామంది కళ్లు తిరిగి పడిపోయారు. లేచి చూసే సరికి ఆస్పత్రిలో ఉన్నారు. అసలు తమకేం జరిగింది, ఎక్కడ ఉన్నాం అని అడిగారు చాలామంది.