ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఎనిమిది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు సమాచారం. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కొవిడ్-19 నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. వారిద్దరికీ గత జూన్ నెలలోనే కరోనా సోకగా.. తాజాగా మరోసారి పాజిటివ్ వచ్చినట్లు సాక్షి వెబ్ సైట్లో ఓ వార్త కథనం రాశారు.