ఆంధ్రప్రదేశ్ లో  డిశ్చార్జిలు స్వల్పంగా పడిపోయాయి. సోమవారం 595 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,59,624 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,626కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,53,618 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో తెలిపింది.