ఇక వాహనదారులూ అలర్ట్ అవ్వండి. మంగళవారం నాడు ‘భారత్ బంద్’ నేపథ్యంలో హైదరాబాద్లో పలు రహదారులపై ప్రయాణాలు కష్టతరం అవుతాయని పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు డిసెంబర్ 8వ తేదీన ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.