ఇక చేపలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే శరీరానికి అవసరమైన పోషకాలు సంవృద్ధిగా ఉండటంతో పాటు విటమిన్లు సైతం చేపల్లో పుష్కలంగా ఉంటాయి. చేపలు తినడంతో అనేక అనారోగ్య సమస్యలు మనల్ని దరిచేరకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.