‘‘లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇస్తాం. కాదూ, మెటీరియల్ ఇవ్వండి, లేబర్ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తాం. లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం.. ఇళ్లు లబ్ధిదారుడే కట్టుకోవచ్చు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యం’’ అని సీఎం జగన్ కీలక విషయాలు వెల్లడించారు. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమ కొనసాగుతుందన్నారు.